హైదరాబాద్‌లో ఖరీదైన విల్లా కొన్న కన్నడ స్టార్ హీరో

కన్నడ స్టార్ హీరో సుదీప్ టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. తెలుగులో ఈగ సినిమాలో విలన్‌గా సుదీప్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ పాత్రకు గాను సుదీప్‌కు చాలా అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తున్న సుదీప్.. ఇటీవల తెలుగు బిగ్‌బాస్-4కు గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక కన్నడ బిగ్‌బాస్ షోను సుదీప్ హోస్ట్ చేస్తున్నాడు.

KICCHA SUDEEP

అయితే తాజాగా హైదరాబాద్‌లో సుదీప్ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని విలువు దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాలు చెబతున్నాయి. గచ్చిబౌలిలో ఈ విల్లా ఉందని తెలుస్తోంది. కన్నడ సినిమా షూటింగ్‌లు చాలా వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. దీంతో సుదీప్ ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండాల్సి వస్తోంది. దాని వల్ల హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో సుదీప్ విల్లా కొనుగోలు చేశాడట.

ప్రతిసారి షూటింగ్‌కు వచ్చినప్పుడల్లా ఫైవ్ స్టార్ హోటల్‌ లో ఉండాలంటే చాలా ఖర్చు అవుతుందట. అందుకే విల్లా కొనుగోలు చేశాడని చెబుతున్నారు. రక్తచరిత్ర సినిమాతో ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సుదీప్.. ఈగ సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన సుదీప్.. సైరా నరసింహరెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించాడు.