నిహారికకు పవన్ భారీ గిఫ్ట్

ఇవాళ సాయంత్రం నిహారిక పెళ్లి జరుగుతుండటంతో ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఉదయ్ పూర్ చేరుకుని సందడి చేస్తోంది. ఇప్పటికే డ్యాన్సులతో మెగా ఫ్యామిలీ సందడి చేస్తుండగా.. నిన్న రాత్రి పవన్ కూడా వెన్యూ దగ్గరికి చేరుకోవడంతో అ సందడి మరింత ఎక్కువైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నిహారిక పెళ్లికి సంబంధించిన వార్తలు, డ్యాన్సులు వేస్తూ మెగా ఫ్యామిలీ చేస్తున్న సందడి చేస్తున్న వీడియోలే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

pawan kalyan

చిరంజీవి వేసిన స్టెప్పులు, నిహారిక,కాబోయే వరుడు చైతన్య వేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. నిహారికకు పవన్ ఇచ్చిన గిఫ్ట్ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. నిహారికకు పవన్ కల్యాణ్ రూ.కోటి విలువ చేసే నగలను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి దంపతులు రూ.2 కోట్ల విలువైన వజ్రాల హారాన్ని గిఫ్ట్ ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే నిహారికకు భారీ గిఫ్ట్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు స్టార్ వస్తుండగా.. ఇందులో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారు. హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ మాత్రమే ఉన్నారు. అయితే సెలబ్రెటీలు ఎంతమంది ఈ పెళ్లికి హాజరు అవుతున్నారనేది ఇవాళ సాయంత్రం మాత్రమే తేలనుంది.