ప్రభాస్ తమ్ముడిగా తమిళ హీరో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ రాముడిగా నటించుండగా.. రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించనున్న విషయం తెలిసిందే. పౌరాణిక కథల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలకమైన సీత పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ సీత పాత్రలో నటించడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి.

ఇక కీలకమైన మరో పాత్ర అయిన రాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది దానిపై క్లారిటీ ఇచ్చింది. లక్ష్మణుడి పాత్ర కోసం తమిళ యంగ్ హీరో అథర్వను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాలో అథర్వ నటించాడు. ఆ సినిమాలో తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వా తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ తమిళ సినిమాలపైనే అథర్వ ఎక్కువ ఫోకస్ పెట్టాడు.

ఆదిపురుష్ పాన్ ఇండియా సినిమా కావడంతో.. ఇందులో లక్ష్మణుడి పాత్రలో నటించేందుకు అథర్వ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. రామాయణంలో లక్ష్మణుడి పాత్ర చాలా కీలకం. అలాగే ఈ సినిమాలో కూడా లక్ష్మణుడి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ పక్కన చాలా సీన్లలో అథర్వ కనిపించే అవకాశముంది.