పూరి జగన్నాథ్ దర్శకత్వంలో KGF హీరో..?

దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఒక్కసారైనా వర్క్ చేయాలని చాలా మంది హీరోలు ఆశపడుతుంటారు. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హిరోలందరితో వర్క్ చేసిన ఆయన ఇప్పుడు నేటితరం యంగ్ హీరోలతో కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. అయితే పూరి దృష్టిలో కన్నడ హీరో యష్ పడినట్లు తెలుస్తోంది. గతంలో పలువురు కన్నడ స్టార్ హీరోలతో వర్క్ చేసిన పూరి KGF సినిమా చూసినప్పటి నుంచి యష్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నాడట. కుదిరితే వీలైనంత త్వరగా కథ చెప్పాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం KGF సెకండ్ పార్ట్ ను ఫినిష్ చేయాలని యష్ తీరిక లేకుండా పని చేస్తున్నాడు. ఈ సినిమా 2020 జనవరిలో వచ్చే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.