రిసెప్ష‌న్‌లో చిందేసి హ‌ల్‌చ‌ల్ చేసిన రాకింగ్‌స్టార్ య‌శ్‌!

క‌న్న‌డ రాకింగ్‌స్టార్ య‌శ్ కేజీఎఫ్ సినిమాతో సినీ ప్రేక్ష‌కుల్లో రాకీభాయ్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు య‌శ్‌. ఇటీవ‌లే కేజీఎఫ్‌-1 చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న కేజీఎఫ్‌-2 నుంచి టీజ‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ టీజ‌ర్‌తో ఈ సినిమాపై అంచ‌నాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి య‌శ్‌పైనా ఉంది. కాగా అత‌ను ఎక్క‌డికి వెళ్లిన ఫోటోలు క్లిక్‌మ‌నిపిస్తాయి.

yash dance

ఈ క్ర‌మంలో తాజాగా.. ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు ర‌మేశ్ అర‌వింద్ కుమార్తె వివాహ రిసెప్ష‌న్‌కి హ‌జ‌రైన య‌శ్.. ఆయ‌న‌తో పాటు త‌న భార్య రాధికా పండిట్‌తో క‌లిసి వ‌చ్చి నూత‌న దంప‌తుల‌కు వివాహ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే ఈ పార్టీలో య‌శ్‌, ర‌మేశ్ అర‌వింద్‌, నూత‌న దంప‌తుల‌తో డ్యాన్స్ చేస్తూ ర‌చ్చ చేశారు. ప్ర‌స్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.