‘BB3’ రిలీజ్ అప్పుడే?

బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ జరుగుతోంది. మరో నెలలో దీని షూటింగ్ ముగిసే అవకాశముంది. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కానీ మోనార్క్ అనే టైటిల్‌ను సినిమా యూనిట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

BB3 RELEASE DATE FIXED

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ఉగాది కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.