హీరోయిన్ తమన్నాకి హైకోర్టు నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు కేరళ హైకర్టుకు షాక్ ఇచ్చింది. కేరళలో ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌ని రద్దు చేయాలని కోరుతూ త్రిసూర్‌కి చెందిన పోలీ వర్గీస్ హైకోర్టును ఆశ్రయించారు. వీటికి సెలబ్రెటీలు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ప్రచారం చేయడానికి ఆపాలని కోర్టును ఆశ్రయించారు.

highcourt notices tamanna

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు.. తాజాగా నోటీసులు జారీ చేసింది. తమన్నాతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాలీవుడ్ నటుడు అజు వర్గీస్‌కి కూడా నోటీసులు జారీ చేసింది.