త్వరలో జనసేనలోకి చిరు.. జనసేన ముఖ్యనేత సంచలన వ్యాఖ్యలు

జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పవన్ వెంట చిరంజీవి నడవనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలో క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా పవన్‌కు అండగా ఉంటానని చిరంజీవి హామీ ఇచ్చారని, పవన్‌కు మద్దతుగా ఉంటానని చిరు చెప్పారన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి కారణం చిరంజీవేనని, రెండు మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత రాజకీయాలు చేసుకోవాలని చెప్పారన్నారు.

chiranjevi join janasena

తర్వాత పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను కూడా అండగా నిలబడతానని, కలిసి నడుస్తానంటూ చిరంజీవి హామీ ఇచ్చారన్నారు. నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో త్వరలో చిరు జనసేనలోకి చేరి పవన్‌కు అండగా నిలుస్తారా అనే చర్చ జరుగుతోంది.