కమల్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ రెడీ

విలక్షణ నటుడు కమల్ హాసన్ నవంబర్ 7న తన పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు కమల్ బర్త్ డే గిఫ్ట్ రెడీ చేశాడు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో కమల్ ఓ సినిమా చేస్తుండగా.. దీనిని ఇంకా టైటిల్ ఖారారు కాలేదు. ఈ సినిమాకు ‘గురు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్.

పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. కమల్ హాసన్ బర్త్ డే రోజైన నవంబర్ 7న సాయంత్రం 5 గంటలకు సినిమా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనుండటంతో ట్రైలర్ కోసం కమల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను రాజ్‌కమల్ బ్యానర్‌ నిర్మించనుండగా.. అనిరుథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నాడనే ప్రచారం జరుగుతోంది.