మొదలైన కాజల్ అగర్వాల్ వెడ్డింగ్ ఫెస్టివల్స్.. స్పెషల్ ఫోటో వైరల్

కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అక్టోబర్ 30న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి వేడుకలు బుధవారం నుంచే మొదలయ్యాయి. వధువు మెహెంది వేడుక నుండి వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లుతో ఎన్నో ఏళ్ల డేటింగ్ అనంతరం వివాహం చేసుకోబోతొంది.

బుధవారం నిర్వహించిన మెహెంది వేడుక నుండి కాజల్ ఒక స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. ఈ ఈవెంట్ ప్రైవేట్ గానే నిర్వహించారు. సోషల్ మీడియాలో ఒక పిక్ మాత్రమే కనిపించింది, కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ప్రతి రోజు ఎదో ఒక స్పెషల్ ఫొటో షేర్ చేసుకుంటూ వస్తోంది. కాజల్ తన జీవితంలో ఈ కొత్త దశ కోసం సంతోషంగా మరియు ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆమెకు బంగారం లాంటి మొగుడు దొరికాడు అంటూ నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుక లో కాజల్ ఒక సాధారణ ఆకుపచ్చ ముద్రిత సల్వార్ కమీజ్ ధరించి ఉంది. ఇక శుక్రవారం ముంబైలో ఒక చిన్న, ప్రైవేట్ వేడుకలో కేవలం అతి తక్కువమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనుంది.