పవన్ కళ్యాణ్ సినిమాలో నితిన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ మాత్రం చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మలయాళం హిట్ మూవీ అయ్యప్పన్ కొశీయుమ్ రీమేక్ లో మరో హీరో ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. మొన్నటి వరకు రానా దగ్గుబాటి మరో హీరో అన్నారు. నితిన్, పవన్ కళ్యాణ్ అభిమాని అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ తో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు గాని సరైన అవకాశం దక్కడం లేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా అయ్యప్పన్ కొశీయుమ్ కథకు అతన్ని సెట్ చేసే పనిలో ఉన్నారట. అడిగితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడాని చెప్పవచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.