మహేష్, త్రివిక్రమ్ మూవీ మరింత ఆలస్యం.. ఇప్పట్లో లేనట్లే!

అతడు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఖలేజా సినిమాతో అర్ధమయ్యింది. అయితే ఖలేజా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. అందుకే ఎలాగైనా మరో సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని వీరు చాలా కాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఒక కాన్సెప్ట్ కి గ్రీన్ సిగ్నల్ దొరికింది.

కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా లేదని అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాటతో చాలా బిజీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ సర్కారు వారి పాటతో పాటే తన కథను కూడామహేష్ తో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వడం లేదు. ఆయన త్వరలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో కూడా బిజీ కానున్నాడు. సర్కారు వారి పాట అనంతరం మహేష్ పూర్తిగా రాజమౌళి కోసం రెడీ కానున్నాడు కాబట్టి వచ్చే రెండేళ్లలో త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వస్తుందా లేదా అనేది అనుమానమే అనే కామెంట్స్ వస్తున్నాయి.