‘జ్వాలా గుత్తా’, యాక్టర్ ‘విశాల్’ నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్!!

బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా మరియు నటుడు విష్ణు విశాల్ చివరకు రూమర్స్ కి ఎండ్ కార్డ్ పెట్టి నిశ్చితార్థంతో క్లారిటీ ఇచ్చారు. జ్వాల గుప్తా పుట్టినరోజు సందర్భంగా విశాల్ ఈ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం నేషనల్ మీడియాలో ఈ లవ్ బర్డ్స్ కి సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

బ్యాడ్మింటన్ ఛాంపియన్ కి ఒక నటుడికి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.


2010 కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేతకు ఈ యాక్టర్ రింగ్ ని ఇస్తున్నట్లు కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు జ్వాలా. ఇది జీవితానికి కొత్త ప్రారంభం .. హ్యాపీగా ఉండండి. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా మంచి భవిష్యత్తు కోసం కృషి చేద్దాం.. అని విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక చాలా కాలం నుంచి ఈ రాట్సాసన్ యాక్టర్ జ్వాలాను ఇష్టపడుతున్నాడట. గత ఏడాది జూన్ వరకు డేటింగ్ లో ఉన్న ఈ స్టార్డ్ ఇద్దరు ఒక క్లారిటీకి వచ్చారట. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశాల్ వివరణ ఇచ్చారు.