ఆస్కార్ నుంచి జల్లికట్టు ఔట్

ఆస్కార్ అవార్డు రేసు నుంచి మలయాళ మూవీ జల్లికట్టు తప్పుకుంది. ఆస్కార్ అవార్డుకు పోటీ పడే సినిమాలు, షార్ట్ ఫిల్మ్ పేర్లను తాజాగా ద అకాడమీ వెల్లడించింది. ఈ జాబితాలో జల్లికట్టు మూవీ లేదు. భారత్ నుంచి బిట్టు అనే షార్ట్ ఫిల్మ్ చోటు దక్కించుకుంది. కరిష్మా దేవ్ దూబె ఈ షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించగా.. ఆయనే దీనికి సహా సహా నిర్మాతగా వ్యవహించారు. రాణీ కుమారి అనే చిన్నారి బిట్టు పాత్రలో నటించింది.

jallikattu movie oscar naminations

జల్లికట్టు ఆస్కార్‌కు నామినేట్ అయినా.. ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. మార్చి 10తో ఆస్కార్ నామినేషన్ ఓటింగ్ ప్రారంభం కానుండగా.. మార్చి 10తో ముగియనుంది. మార్చి 15న అవార్డులను ప్రకటించనుండగా. ఏప్రిల్ 25న ప్రదానం చేయనున్నారు.