Radheshyam: ప్రేమికుల రోజు కోసం డ‌బ్బింగ్ చెబుతున్నా: పూజా హెగ్దే

Radheshyam: యంగ్ రెబెల్‌స్టార్ ప్ర‌భాస్‌- పూజాహెగ్దే జంట‌గా రాధేశ్యామ్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కులు కూడా ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అప్‌డేట్స్ కోసం వేచి చూస్తున్నారు ఫ్యాన్స్‌. అయితే ఆ టైం రానే వ‌చ్చేసింది. అదే రాధేశ్యామ్ టీజ‌ర్‌. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న రాధాకృష్ణ , చిత్రబృందం ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది.

pooja hegde

Radheshyam రాధేశ్యామ్ టీజ‌ర్ ప్రేమికుల రోజు కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం తెలిపారు. దీంతో Radheshyam ఈ టీజ‌ర్‌కు సంబంధించిన డ‌బ్బింగ్ విష‌యంలో హీరోయిన్ పూజాహెగ్దే డ‌బ్బింగ్ స్టూడియోకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా డ‌బ్బింగ్ చెప్తున్న ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది పూజా. మా టీజ‌ర్ కోసం ఉద‌యాన్నే డ‌బ్బింగ్‌. 14ఫిబ్ర‌వరి కోసం మేము ఇక్క‌డిక వ‌చ్చాం అంటూ త‌న ఇన్‌స్టాలో రాసుకొచ్చింది పూజా. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ Radheshyamఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు.