Bollywood: నాకంటే ఏ న‌టి న‌టించ‌లేరు, భూమ్మీద కూడా లేరు: క‌ంగ‌నార‌నౌత్

Bollywood: బాలీవుడ్ క్వీన్ కంగ‌నార‌నౌత్ త‌న న‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో కొన్ని వ్యాఖ్య‌లు చేసింది. దీంతో కంగ‌నాపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ సెటైర్లు వేస్తున్నారు. దీనికి మ‌ళ్లీ రీట్వీట్ చేస్తూ నెటిజ‌న్లపై మండిప‌డింది కంగ‌నా. అస‌లు ఏంటీ కంగ‌నా వ్యాఖ్య‌లు.. నెటిజ‌న్లు సెటైర్లు.. మండిపోవ‌డం ఏంటీ అని.. వివ‌రాల్లోకి వెళితే.. కంగ‌నా న‌టిస్తున్న ప్ర‌స్తుత చిత్రాలు త‌లైవి, థాక‌డ్‌.. దీంతో ఈ చిత్రాల్లో కోసం కంగ‌నా తీసుకుంటున్న శిక్ష‌ణ‌, ఆ సినిమా లుక్‌ల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్య‌లు చేసింది కంగనా. Bollywood త‌న స్థాయిలో న‌టించ‌గ‌లిగే మ‌రో న‌టి ప్ర‌స్తుతం ఈ భూమి మీద లేద‌ని తెలిపింది.

kangana ranuat

వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో అద్భుతంగా పోషించే హాలీవుడ్ న‌టి మెర్లీ స్ట్రీప్‌లో ఉండే ప్ర‌తిభ త‌న‌లో ఉంద‌ని, అలాగే హాలీవుడ్ మ‌రో న‌టి గాల్ గాడోట్‌లా తాను యాక్ష‌న్ చేయ‌గ‌ల‌న‌ని చెప్పింది కంగ‌నా. మ‌రోవైపు గ్లామ‌ర‌స్ పాత్ర‌ల్లోనూ సైతం కూడా మెప్పించ‌గ‌ల‌ని కంగనా తెలిపింది. ఇక దీంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ కంగ‌నాపై సెటైర్లు వేయ‌డంతో.. మ‌రో ట్వీట్ చేసింది కంగ‌నా.. తాను ఎన్ని ఆస్కార్‌లు సాధించావంటూ.. అస‌లు ఎన్ని అవార్డులు పొందావు అని న‌న్ను కొంద‌రు అడుగుతున్నారు. వారికి నేను చెప్ప‌ద‌ల‌చుకుందొక్క‌టే.. మెరిల్ స్ట్రీప్ ఎన్ని జాతీయ అవార్డులు, ఎన్ని ప‌ద్మ అవార్డులు సాధించింద‌ని.. వీటికి స‌మాధానాలు దొర‌క్క‌వు.. విమ‌ర్శ‌లు చేస్తోన్న వారు బానిస మ‌న‌స్త‌త్వం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆమె నెటిజ‌న్ల‌పై మండిప‌డింది. ఆత్మ గౌర‌వంతో మెల‌గాల‌ని చెప్పుకొచ్చింది కంగ‌నా. Bollywood ఇక తాను న‌టించే త‌లైవి, ధాక‌డ్‌ చిత్రాలు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.