మేలో సాయిధరమ్ తేజ్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పెళ్లిపై గత కొద్దిరోజులుగా అనేక రూమర్స్ వస్తున్నాయి. నిహారిక పెళ్లి పూర్తవడంతో.. ఇక మెగా ఫ్యామిలీలో నెక్ట్స్ ఎవరి పెళ్లి జరుగుతుందోననే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. నెక్ట్స్ సాయిధరమ్ తేజ్ పెళ్లి జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ పెళ్లి మే నెలలో జరుగుతుందని తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాయిధరమ్ తేజ్ తల్లి ఇప్పటికే అమ్మాయిని కూడా సెలక్ట్ చేశారని టాక్.

saidharam tej marraige may

మెగా ఫ్యామిలీకి బాగా దగ్గర బంధువుల అమ్మాయినే సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకోనున్నాడట. లాక్‌డౌన్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విడుదల అవ్వగా.. అది మిక్స్ డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం దేవ్ కట్టా డైరెక్షన్‌లో రిపబ్లిక్ అనే సినిమాలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు దీనిని నిర్మిస్తుండగా.. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.