‘బాలు’ గారు ఆమె మాట విని ఉంటే బ్రతికేవారు..?

కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం. కనురెప్ప పాటులో ఉండేదో ఒక చిన్న జీవితం. కానీ ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం జీవితం అలాంటిది కాదు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలు ఆయన పాటతో ఇంకా ప్రతి మనిషి పక్కనే ఉన్నారని అనిపిస్తోంది. అయితే బాలసుబ్రహ్మణ్యం మరణానికి కోవిడ్ 19 కారణమని అందరికి తెలిసిందే.

ఆగస్ట్ 5వ తేదీన కరోనా వైరస్ భారిన పడినట్లు ఆయనే స్వయంగా చెప్పారు. అయితే అంతకుముందు ఆయన పేద సంగీత కళాకారుల కోసం నిర్వహించిన ఒక మ్యూజిక్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అంతకుముందు వరకు గత 5నెలలుగా ఇంట్లోనే ఉన్న SPB ఆ సమయంలో పేద కళాకారుల కోసం నిర్వహించే కార్యక్రమం అనగానే చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చారు. ఆ ఈవెంట్ లోనే ఆయన కరోనా భారిన పడినట్లు తెలిసింది. అసలు ఆ కార్యక్రమానికి వెళ్లవద్దని ఆయన సతీమణి సావిత్రి గారు ఎంతగానో రిక్వెస్ట్ చేశారు. కానీ అలాంటి మంచి కార్యక్రమం నా వల్ల ఆగిపోకూడదు, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని సమాధానం చెప్పి వెళ్లారు. ఇక ఆ తరువాత 5రోజులకే కరోనా లక్షణాలతో హాస్పిటల్ లో చేరి దాదాపు 50రోజులు మృత్యువుతో పోరాడి బాలు శుక్రవారం కన్నుమూశారు.