‘SP.బాలసుబ్రహ్మణ్యం’ మొదటి డ్రీమ్ ఏంటో తెలుసా?

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. కేవలం ఒక గాయకుడి గానే కాకుండా సంగీత దర్శకుడు, నటుడు కూడా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ ఇలా భారతదేశంలోని 14కిపైగా భాషల్లో పాటలు పాడారు. సుమారు 40 వేలకుపైగా పాటలు పాడిన బాలు ఈ స్థాయికి చేరుకోవడం అంటే ఒక వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి.

అయితే కాలేజి రోజుల్లో తనకు సినిమా సైడ్ వెళ్ళాలి అనే ఆలోచన కూడా లేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి ఇంజనీరింగ్ చదివేటప్పుడు కాలేజ్ వేదికల్లో పాటలు పడుతుంటేనే అవకాశాలు వచ్చాయి. వద్దని అనుకున్నా. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి అలా జీపులో మంచి క్యాప్ పెట్టుకోని ఒక ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాను. ఆ రోజుల్లో 200రూపాయల జీతం వస్తే గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ అన్నట్లు లెక్క. ఆ విధంగా సంపాధించాలని చాలా పెద్ద డ్రీమ్ ఉండేదని బాలసుబ్రహ్మణ్యం జయప్రదం ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఇక అదృష్టమో యాదృచ్చికమో తెలియదు గాని సడన్ గా 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ప్రస్థానం ప్రారంభమైందని వివరణ ఇచ్చారు.