బాలీవుడ్ లో కోలీవుడ్ హిట్ మూవీ రీమేక్

బాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. బీటౌన్ సూపర్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్.. తమిళ్ ఫిల్మ్ ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌లో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే 2022లో గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ఉండబోతోందని ప్రకటించిన మేకర్స్.. ఒరిజినల్ ఫిల్మ్ డైరెక్టర్స్ పుష్కర్ – గాయత్రినే హిందీ వెర్షన్‌ను డైరెక్ట్ చేస్తారని స్పష్టం చేశారు.

కాగా 2017లో రిలీజైన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘విక్రమ్ వేద’లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఆర్ మాధవన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. జానపద ‘బేతాళుడి కథలు’ ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆద్యంతం ఆకట్టుకోగా.. సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా, మాధవన్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకులను మెప్పించారు. తనను పట్టుకునేందుకు ప్రతీ సారి ఓ క్లూ ఇచ్చేందుకు పోలీసు ముందుకొచ్చే గ్యాంగ్‌స్టర్.. చేతికి చిక్కినట్లే చిక్కి ఎస్కేప్ అవుతుంటాడు. ఇలాంటి థ్రిల్లింగ్ కథ బాలీవుడ్ కి వెళ్తుంది అంటే అక్కడ కూడా సూపర్ హిట్ అయినట్లే.