Ram pothineni: ఓం న‌మః శివాయ అంటున్న హీరో రామ్ పోతినేని..

Ram pothineni: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌పోతినేని న‌టించిన రెడ్ మూవీ సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప్రేక్ష‌కుల నుంచి ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌లేదు.. కానీ రామ్‌కు ఎంతో గుర్తింపు తీసుకువ‌చ్చింది ఈ చిత్రం.. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభిన‌యం చేయగా.. రెండు క్యారెక్ట‌ర్‌లో ఎంత‌గానో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.

ram pothineni

Ram pothineni ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా.. త‌మిళ్‌లో విజ‌య‌వంత‌మైన త‌డం మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. థ్రిల్లింగ్‌, సస్పెన్స్ జోన‌ర్‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది ఈ చిత్రం.Ram pothineni ఇక చిత్రం అనంత‌రం రామ్ ప్ర‌స్తుతం శివ‌మాల‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోను త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు రామ్ స్వామి.. ఓం న‌మఃశివాయ.. కొంత విరామం.. త్వ‌ర‌లో క‌లుస్తా అంటూ ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది.