Samantha Instagram: సోషల్ మీడియాలో సమంత అరుదైన ఫీట్

Samantha Instagram: అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో మరో అచీవ్‌మెంట్ సాధించింది. ఇటీవల సమంత ఫొటోతో ట్విట్టర్‌లో ఎమోజీ రావడంతో.. ట్విట్టర్‌లో ఎమోజీ పొందిన తొలి భారతీయ మహిళా నటిగా ఆమె నిలిచింది. ఈ క్రమంలో సమంత సోషల్ మీడియాలో మరో రికార్డు నమోదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత వేగంగా 15 మిలియన్ల ఫాలోవర్స్ సాధించిన సెలబ్రెటీగా నిలిచింది.

samantha15 million followers

తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 15 మిలియన్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒక వీడియోను షేర్ చేసిన స్యామ్.. ఇంతమంది తనను ఫాలో అవ్వడం చాలా ఆనందంగా ఉందని, అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. మీ ప్రేమ తనపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానంటూ సమంత చెప్పుకొచ్చింది. అయితే సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చూస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.