BREAKING: నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ సర్కార్‌కి చుక్కులు చూపిస్తున్నారు. తాజాగా నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని హోస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఆయనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేయాలని, మీడియాతో మాట్లాడకుండా చూడాలని అధికారులకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21 వరకు ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

NIMMAGADDA ON PEEDIREDDY

పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేంచేలా ఉన్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఏకంగా ఒక మంత్రిని అరెస్ట్ చేయాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేయడంపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రజాస్వామ్యం, ప్రభుత్వంలో ఉన్న మంత్రిని ఇంట్లో పెట్టాలనే ఆలోచన చేయడం దుర్మార్గం అన్నారు.