బంగారం లాంటి సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న “గోల్డ్ మెడల్ 🥇”

మన జీవితం లో బంగారం తో విడదీయరాని బంధం ఉంది, ఒకరికి నగల మోజు, ఇంకొకరికి వ్యాపారం, మరొకరికి మొక్కుబడి, ప్రతి ఒక్కరికీ బంగారం సెంటిమెంట్ అయిన కొత్త పాయింట్ తో యు. కె. క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కుమార్,దేవిశ్రీ, రుక్మిణి, నటీనటులుగా ఉదయ్ కుమార్ ముంత దర్శకత్వంలో నవీన్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం “గోల్డ్ మెడల్ 🥇” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమౌతున్న సందర్భంగా

చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ ముంత మాట్లాడుతూ ..ఈ కథ లోని పాత్రలు బంగారంతో యే విదంగా ముడిపడి ఉన్నాయనే కథాంశంతో నిర్మించిన చిత్రమే “గోల్డ్ మెడల్ 🥇.నిర్మాతకు నేను కథ చెప్పిన వెంటనే నాపై నమ్మకంతో ఈ చిత్రానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పడం జరిగింది.నేను ఏ లొకేషన్ కావాలన్నా ఖర్చుకు వెనుకడకుండా నిర్మించినందుకు ఆయనకు నా ధన్యవాదాలు. నటీనటులు అందరూ కూడా బాగా సహకరించారు. చిత్రం చాలా బాగా వచ్చింది. నిర్మాత నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాననే నమ్మకం ఉంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు.

నిర్మాత నవీన్ చంద్ర మాట్లాడుతూ.. మన జీవితంలో బంగారంతో విడదీయరాని బంధం ఉంది, ఒకరికి నగల మోజు, ఇంకొకరికి వ్యాపారం, మరొకరికి మొక్కుబడి, ప్రతి ఒక్కరికీ బంగారం సెంటిమెంట్ ఈ సినిమాలో కథా నాయకుడు జీవితాన్ని బంగారం ఏ విధమైన మలుపులు తిప్పింది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు నాకు ఏవిదమైన కథ చెప్పాడో అలాగే తీశాడు.నటీనటులు అందరూ చక్కగా నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాము. ఒక కొత్త ప్రయత్నం తో మేము ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని అన్నారు.

నటీనటులు
ఉదయ్ కుమార్,దేవిశ్రీ, రుక్మిణి, రత్న, దేవికా దాస్,
భవాని,స్నిగ్ధ రెడ్డి, గౌరెల్లి లత, రమేష్ (రవి),వంశీ క్రిష్ణ, చాణక్య,నరేష్

సాంకేతిక నిపుణులు
బ్యానర్: యు. కె. క్రియేషన్స్
కథ,మాటలు, స్క్రీన్ ప్లే : ఉదయ్ కుమార్ ముంత
నిర్మాత: నవీన్ చంద్ర
డి.ఓ.పి: రెహమాన్ బాబా
మ్యూజిక్: రోషన్ సాలూరి
ఎడిటర్ : శశాంక్ మాలి, రితిక దేవిరెడ్డి
లిరిక్స్ :మల్లెగోడ గంగాప్రసాద్
డియల్: భూషణ్
వి.యఫ్.ఎక్స్: నాగరాజు సప్ప
పి.ఆర్.ఓ: మధు వి.ఆర్
మేకప్ : శ్రీహరి
డబ్బింగ్ ఇంజినీర్ :పవన్