‘గ్యాంగ్స్ అఫ్ 18’ ట్రైలర్ రిలీజ్

స్టార్ హీరోలు మమ్ముట్టి , ప్రిథ్వి రాజ్ సుకుమారన్, ఆర్య , ఉన్నిముకుందన్ ప్రత్యేక పాత్రల్లో నటించిన యూత్ డ్రామా గ్యాంగ్స్ అఫ్ 18 . శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత జీ వెంకట సాంబి రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు . ఈ సినిమాకు సంబందించిన తెలుగు ట్రైలర్ ను నేడు ప్రముఖ హీరో సుమంత్ , డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి విడుదల చేసారు .

GANGS OF 10 TRAILER

హీరో సుమంత్ గారు మాట్లాడుతూ – ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది , ప్రొడ్యూసర్ సాంబి రెడ్డి గారికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా ఖచ్చితంగా చాలా బాగా ఆడుతుంది అని నమ్ముతున్నాను . సినిమాలో మమ్మూటీ , ఆర్య , ప్రిథ్వి రాజ్ లాంటి చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు . ఐ విష్ ది హోల్ టీం అల్ ది బెస్ట్ అని అన్నారు.

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. సాంబి రెడ్డి గారు మా ఫ్యామిలి కి చాలా ఏళ్ళ నుంచి క్లోజ్ , గ్యాంగ్స్ అఫ్ 18 ట్రైలర్ చాలా బాగుంది , ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. సాంబి రెడ్డి గారికి వాళ్ల టీం కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు. నిర్మాత జీ .సాంబి రెడ్డి గారు మాట్లాడుతూ.. హీరో సుమంత్ గారు మా గ్యాంగ్స్ అఫ్ 18 ట్రైలర్ విడుదల చేసినందుకు మా ధన్యవాదాలు , మా బ్యానర్ ద్వారా ఈ సినిమా ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది , తెలుగు ప్రేక్షకులకు ఖచ్చింతంగా ఈ సినిమా నచుతుంది అని మా గట్టి నమ్మకం. మా శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి మంచి సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తాం అని వ్యాఖ్యానించారు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి నందన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. హీరో సుమంత్ గారు మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది , అక్కినేని ఫ్యామిలి కి చాలా పెద్ద ఫ్యాన్ నేను . మా ట్రైలర్ ను విడుదల చేసినందుకు సుమంత్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను . సినిమా యూత్ కి చాలా కనెక్ట్ అవుతుంది . మంచి కాలేజీ డ్రామా , ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరితో కలిసి చూడాల్సిన సినిమా . మలయాళం స్టార్స్ మమ్ముట్టి , ఆర్య ,ప్రిథ్వి రాజ్ సుకుమార్ , ఉన్ని ముకుందన్ , ప్రియమణి తదిదరులు నటించారు , విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తాం అని అన్నారు.