ఫిబ్రవరి 19న నాంది

అల్లరి నరేష్ హీరోగా నటించిన అల్లరి బుల్లోడు సినిమా ఇటీవల విడుదలవ్వగా.. అది అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే ఇప్పుడు నాంది అనే సినిమాతో నరేష్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అల్లరి బుల్లోడు పరాజయం పాలవ్వడంతో.. నాందిపై నరేష్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మించాడు.

NANDI ON FEBUARY 19

వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇందులో కీలక పాత్రలలో నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 19న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే రోజు విశాల్ నటించిన చక్ర, కన్నడ హీరో ధృవ సర్జా నటించిన పొగరు సినిమాలు విడుదల కానున్నాయి.