ఫేక్ ఫాలోవర్స్.. ప్రియాంక చోప్రా, దీపికా విచారణను ఎదుర్కోబోతున్నారా?

ఇండియాలోనే టాప్ మోస్ట్ క్రేజ్ అందుకుంటున్న హీరోయిన్స్ దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా. వీళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు ఒక మీడియం హీరోల కంటే ఎక్కువ రేంజ్ లోనే రెమ్యునరేషన్ అందుకుంటారు. ఇక సోషల్ మీడియాలో వీరి ఫాలోవర్స్ సంఖ్య కూడా ఊహించని విధంగా ఉంటుంది.

అయితే వీరి ఫాలోవర్స్ సంఖ్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి నిజమైన ఎకౌంట్స్ ఆ.. లేక ఫేక్ ఐడిలా అనే విషయంలో త్వరలోనే ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు ఈ స్టార్ యాక్టర్స్ ని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీపికకు ఇన్స్టాగ్రామ్ లో 50 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ట్విట్టర్ లో 27+ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక ప్రియాంకకు ఇన్స్టాగ్రామ్ లో 55మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. ట్విట్టర్ లో 26మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇందులో ఫేక్ ఫాలోవర్స్ చాలానే ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రెంచ్ కంపెనీ ఫేక్ ఎకౌంట్స్ ని క్రియేట్ చేసి సెలబ్రెటీస్ కి ఫాలోవర్స్ పెరిగేలా పెంచేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే పోలీసులు ఈ స్టార్ బ్యూటీలను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.