బాలీవుడ్ మీ అయ్యది కాదు.. కంగనా కోసం బాలీవుడ్ యాక్టర్ ఆగ్రహం

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కంగనాకు మద్దతు ఏ రేంజ్ లో లభిస్తుందో అలాగే కొందరి నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. గత నెల ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక రహస్యం తెలియాలని కంగనా తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తోంది. కరణ్ జోహార్ లాంటి సినీ ప్రముఖుల మాఫియా వల్లే సుశాంత్ మరణించినట్లు ఆమె ఆరోపణలు చేస్తున్నారు.

అయితే ఇలాంటి సమయంలో కంగనాపై విమర్శలు కూడా వస్తుండడంతో ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా ఘాటుగా స్పందించారు. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో కంగనా కష్టపడి ఓంటరిగానే పైకొచ్చింది అంటూ ఆమెపై విమర్శలు చేసే వారు ఒకసారి ఆలోచించుకోవాలి అన్నారు. ఆమె ధైర్యాన్ని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారు అంటూ.. బాలీవుడ్ ఇండస్ట్రీ మీ అయ్యది కాదంటూ శత్రుఘ్న సిన్హా వివరణ ఇచ్చారు.