గోపిచంద్ ని లైన్ లో పెట్టిన ప్రభాస్ డైరెక్టర్

యువ దర్శకుడు సుజిత్ సాహో సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోకపోయినప్పటికి దర్శకుడిగా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సుజిత్ మేకింగ్ కి బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఇకపోతే నెక్స్ట్ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని మొన్నటివరకు అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

లూసిఫర్ రీమేక్ ని సరికొత్తగా తెరకెక్కించే ఛాన్స్ ఉందాని కథనాలు వెలువడడంతో ప్రాజెక్ట్ ఫిక్స్ అని ఆల్ మోస్ట్ అందరు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు నెక్స్ట్ గోపిచంద్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా లేక పోస్ట్ ఫోన్ చేశారో తెలియదు గాని మొత్తానికి సుజిత్ గోపిచంద్ కోసం కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ పై క్లారీటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.