దిశా హాట్ ఫోటోలు పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు,

2015లో వ‌రుణ్‌తేజ్, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన లోఫ‌ర్‌తో సినీ రంగ ప్ర‌వేశం చేసిన బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టాని.. త‌ర్వాత అవ‌కాశాలు రాలేదో.. లేక ఈ అమ్మ‌డు టాలీవుడ్‌లో ఇక చాలని అనుకుందో ఏమో కానీ.. బాలీవుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. మ‌హేంద్ర సింగ్ బ‌యోపిక్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాతో బ్రేక్ సంపాదించుకుంది. త‌ర్వాత జాకీ చాన్ కుంగ్ ఫూ యోగ చిత్రంలో న‌టించింది. అయితే టైగ‌ర్ ష్రాఫ్‌తో న‌టించిన భాఘి 2 సూప‌ర్‌డూప‌ర్ హిట్ సాధించ‌డంతో దిశాకు మంచిపేరొచ్చింది. అలాగే టైగ‌ర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచింది. మ‌రి కేవ‌లం సినిమాలు, భాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ అనే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారుకు హీటెక్కిస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంది. ఇప్పుడు మ‌రోసారి అలాంటి సోయ‌గాల‌తో క‌నువిందు చేసేలా ఫోటోను పోస్ట్ చేసింది. నిజానికి దిశా హాట్ ఫోటోలు పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో ఒక బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉన్న దిశా యూత్ ని హీట్ పెంచింది.