కమర్షియల్ హీరో బయోపిక్ లో నటించి మెప్పించగలడా?

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే హీరోల్లో సూర్య ఒక‌రు. అందుకే ఆయ‌న చిత్రాల‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. రీసెంట్ గా సూర్య నటించిన కాప్పాన్ సినిమా రిలీజ్ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రేంజులో ఆకట్టుకోకపోవడంతో సూర్య లిస్ట్ లో ఒక ఫ్లాప్ వచ్చి చేరింది. కప్పాన్ సినిమా సెట్స్ పై ఉండగానే, గురు ఫేమ్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ఒక సినిమాకి అనౌన్స్ చేశాడు. తన ఓన్ ప్రొడక్షన్ లో సూర్య చేయబోతున్న ఈ సినిమా ఒక బయోపిక్ కావడం విశేషం.

surya38

సూర్య, సుధా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎయిర్ డెక్క‌న్ విమాన‌యాన అధిప‌తి గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. విమాన చార్జీల‌ను ఒక రూపాయి, ఐదు వంద‌ల రూపాయల‌కు అందించి.. స‌గ‌టు మ‌ధ్య త‌ర‌గ‌తి వాడికి కూడా విమాన సౌక‌ర్యాన్ని అందించిన గోపీనాథ్ విమాన‌యాన రంగంలో ఓ సంచ‌ల‌నం. కమర్షియల్ హీరోగా పేరున్న సూర్య బ‌యోపిక్‌లో న‌టించ‌డం అనేది సంచ‌ల‌నమే అవుతుంద‌ని సినీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.