‘పవన్ కళ్యాణ్’ 27: స్పెషల్ లుక్ తో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ‘క్రిష్’!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకోవడం అభిమానులకు కొంత నిరాశను కలిగించింది. ఇక రాజకీయాల్లో బిజీగా ఉండడం వలన మళ్ళీ సినిమాలు చేయరేమో అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పవన్ ఒకేసారి వరుసగా కొత్త ప్రాజెక్టులను ఎనౌన్స్ చేయడం అభిమానులకు మంచి కిక్కిస్తోంది. వకీల్ సాబ్ అనంతరం క్రిష్ తో 27వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విషెస్ అందిస్తూ స్పెషల్ లుక్ ని విడుదల చేసింది. ఇక దర్శకుడు క్రిష్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. “పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..
ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..
ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని’ క్రిష్ ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు క్లారిటీ వచ్చేసింది. నిర్మాత రామ్ తాళ్లూరి విషెస్ అందిస్తూ పవన్, సురేందర్ రెడ్డి పేర్లను ఎనౌన్స్ చేయడంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది.