PSPK28: పెద్ద బాల శిక్ష, రోజా పువ్వు.. పవన్ తో ‘హరీష్ శంకర్’ భారీ ప్రయోగం!!

హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రానున్న PSPK28 ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్ ని చిత్ర యూనిట్ ఎట్టకేలకు విడుదల చేసింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ పేరు మారు మ్రోగుతోంది. ఇప్పటికే వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లుక్ ని కూడా విడుదల చేశారు.

ఇక గబ్బర్ సింగ్ లాంటి బాక్సాఫీస్ హిట్ సినిమా తీసిన హరీష్ శంకర్ తో మరో సినిమా రానున్నానట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. బైక్ పై రోజా పువ్వు, పెద్ద భాలశిక్ష కనిపిస్తోంది. ఇక గాంధీజీ వంటి మహాత్ముల ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అనేలా దర్శకుడు క్లారిటీ ఇవ్వడం చూస్తుంటే సినిమాలో మంచి మెస్సేజ్ ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.