‘హాట్’ వీడియో సాంగ్ తో హీటేక్కిస్తున్న ‘నివేతా థామస్’!!!

నటి నివేదా థామస్ చివరగా 2020 మొదట్లో వచ్చిన ‘దర్బార్’ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తెగా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నాని V సినిమా ద్వారా మళ్ళీ ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక ఆ అంచనాల డోస్ పెరిగే విధంగా చిత్ర యూనిట్ ఒక హాట్ సాంగ్ ని విడుదల చేసింది. అందులో నివేతా గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శనమిచ్చింది. ‘బేబీ టచ్ మి నౌ’ అనే ఆ పాటలో గ్లామర్ డోస్ పెంచిన నివేత ఓ వర్గం ఆడియెన్స్ ని గట్టిగానే ఎట్రాక్ట్ చేసింది. చూస్తుంటే సినిమాలో ఈ బ్యూటీ సరికొత్తగా కనిపించనున్నట్లు అర్ధమవుతోంది. ఇక ఆమెకి జోడిగా ఈ సినిమాలో సుధీర్ బాబు నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ పాటను షార్వి యాదవ్ పాడారు మరియు అమిత్ త్రివేది స్వరపరిచారు. ఇక ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5 న OTT ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా దిల్ రాజు మిడియమ్ బడ్జెట్ లో నిర్మించారు. మరి ఈ సినిమా డీజిటల్ వరల్డ్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.