‘పవన్ కళ్యాణ్’ కి ‘మహేష్ బాబు’ స్పెషల్ బర్త్ డే విషెస్!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకు ఇష్టమే. ఇక నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు స్టార్స్ కూడా విషెస్ అందిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం హాట్ టాపిక్ మారింది. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, పవన్‌కళ్యాణ్ !! మీ దయ మరియు వినయం ఎల్లప్పుడూ మార్పును ప్రేరేపిస్తాయి. మంచి ఆరోగ్యంతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మహేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక మహేష్, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులని చాలా తక్కువమందికి తెలుసు. అర్జున్ సినిమా సమయంలో పైరసీని అరికట్టేందుకు మహేష్ ప్రయత్నాలు చేయగా ఆ సమయంలో పవన్ ఒక్కడే మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.