రామ మందిర నిర్మాణానికి ప్ర‌ణీత ల‌క్ష‌ విరాళం!

అయోధ్య‌లో శ్రీ‌రాముడి దివ్యాల‌యానికి భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. దాదాపు 1100కోట్ల వ్య‌యంతో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హిందువుల‌కు ఎంతో ఇష్ట‌దైవ‌మైన శ్రీ‌రాముడి ఆల‌యాన్ని అత్యంత వైభ‌వోపేతంగా నిర్మించాల‌ని ఆల‌య ట్ర‌స్ట్ నిర్ణ‌యించింది. ఇందుకోసం రామ ‌మందిర్ నిధుల పేరుతో విరాళాలు సేక‌రిస్తోంది. ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌ముఖులు త‌మ వంతుగా రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు అందించారు.

pranitha

తాజాగా సినీ న‌టి ప్ర‌ణీత మందిర నిర్మాణ కోసం త‌న వంతుగా ల‌క్ష రూపాయ‌ల‌ను ఇస్తున్న‌ట్లు ఆమె ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రు ముందుకు వ‌చ్చి త‌మ‌కు ఉన్నంత‌లో సాయం అందించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆమె కోరారు. ఇదిలా ఉంటే క‌రోనా స‌మ‌యంలో కూడా ప్ర‌ణీత ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి త‌న‌లోని మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. ప్ర‌స్తుతం తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌ప్ప‌టీకి క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో మాత్రం బిజీ హీరోయిన్ అయింది ప్ర‌ణీత‌.