డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు ఫ్యామిలీ భోగి సంబ‌రాలు

తెలుగు వారి పెద్ద పండుగ‌లో మొద‌టిరోజైన భోగి సంబ‌రాల‌ను డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు ఫ్యామిలీ శ్రీ విద్యానికేత‌న్ విద్యా సంస్థ‌ల్లో గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఇంస్టాలో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఫ్యామిలీ అంతా భోగి జ‌రుపుకుంటున్న పిక్ షేర్ చేసాడు మంచు మ‌నోజ్‌. మూడు రోజుల పండుగ కాబ‌ట్టి మంచు ఫ్యామిలీ అంతా క‌లిసి భోగి మంట‌లు వెలిగించి ఎంజాయ్ చేశారు. అంతేగాక సోష‌ల్ మీడియా వేదిక‌గా వారి అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

manchu family

ఈ భోగి సెలెబ్రెష‌న్స్‌లో మోహ‌న్‌బాబుతో పాటు లక్ష్మీ ప్ర‌స‌న్న‌, మంచు మ‌నోజ్‌, మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. ఇక మంచు ఫ్యామిలీలో విష్ణు, మ‌నోజ్ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం హీరోలుగా కొన‌సాగుతున్నారు. లక్ష్మీ ప్ర‌స‌న్న అయితే ఎప్పుడు ఏదొక ప్రోగ్రాంతో సోష‌ల్ మీడియాలో కానీ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రింప‌జేస్తుంది. ప్ర‌స్తుతం మంచు విష్ణు మోస‌గాళ్లు అనే చిత్రంలో న‌టిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మంచు హీరోల్లో డిఫ‌రెంట్ హీరో మ‌నోజ్.. తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత ఒక ప‌వ‌ర్‌ఫుల్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ప్ర‌స్తుతం అహాం బ్ర‌హ్మాస్మి అనే చిత్రంలో మంచు మ‌నోజ్ న‌టిస్తుండ‌గా.. తానే సొంతంగా ఎంఎం ఆర్ట్స్ నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి ఈ సినిమాను తొలిసారి నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చాడు. దీనిపై మ‌నోజ్ చెబుతూ.. ఈ క్రైమ్ కామెడీ యాక్ష‌న్ సినిమాతో మీకు కొన్ని గూస్బంప్స్ ఇస్తాన‌ని మ‌నోజ్ తెలిపాడు.