సంక్రాంతి కానుక‌గా విరాట‌ప‌ర్వం నుంచి మ‌రో పోస్ట‌ర్‌!

ద‌గ్గుబాటి రానా, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం విరాట‌ప‌ర్వం. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎస్ఎల్‌వీ సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మావోయిస్ట్ ఉద్య‌మం నేప‌థ్యంలో కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది.

virataparvam

ఇక ఈ చిత్రం నుంచి సంక్రాంతి కానుక‌గా ఓ స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ వ‌చ్చింది. జ‌న‌వ‌రి 13న విరాట‌ప‌ర్వం నుంచి ఓ పోస్ట‌ర్ చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఇందులో రానా కామ్రేడ్ ర‌వ‌న్న గెట‌ప్‌లో ఉండ‌గా.. సాయిప‌ల్ల‌వి మాత్రం ప‌ల్లెటూరి అమ్మాయిలా ఇద్ద‌రూ న‌వ్వుతూ.. న‌డుచుకుంటూ వ‌స్తున్న ఫోటోతో కూడిన ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రం థియేట‌ర్ల‌కు వ‌స్తున్న‌ట్టుగా అందులో ప్ర‌క‌టించారు. ‌