‘సిటీమార్’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న సినిమా సిటీమార్. తమన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవ్వగా.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

CITIMAR RELEASE DATE

సమ్మర్‌లో ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో చేతిలో పెద్ద చుత్తి పట్టుకుని సీరియస్ లుక్‌లో గోపీచంద్ కనిపించాడు. ఇందులో ఆంధ్రా టీం ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‏గా గోపీచంద్ నటిస్తుండగా… తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‏గా తమన్నా నటిస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. భూమిక ఇందులో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.