RRR: “నీళ్ల‌లో నిప్పు చ‌ర‌ణ్‌” అంటూ వీడియోను పోస్ట్ చేసిన మూవీ టీం..

RRR: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి మ‌రో స‌రికొత్త వార్తా బ‌య‌టికొచ్చింది. ఈ సారి ఆర్ఆర్ఆర్ షూటింగ్ లొకేష‌న్ నుంచి సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు చిత్ర‌మూనిట్‌. అదేంటంటే.. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే RRRఈ షూటింగ్‌లో భాగంగా.. మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌రణ్ నీళ్ల నుంచి న‌డుస్తూ వ‌చ్చే స‌న్నివేశం వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా..

Cherry

RRR నీళ్ల‌లో నిప్పు అంటూ జ‌త చేశారు చిత్ర‌బృందం. ఇక ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల్లో పోషిస్తుండ‌గా.. దీనికి సంబంధించిన టీజ‌ర్ గ‌తంలోనే రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల్లో మ‌రింత అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ RRR టీజ‌ర్‌లో రాంచ‌ర‌ణ్ నిప్పు మ‌ధ్య‌లో పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఉండ‌డంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అలాగే కొమురం భీంగా యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ న‌టిస్తుండ‌గా.. దీనికి సంబంధించిన టీజ‌ర్‌లో ఎన్టీఆర్ నీళ్ల లోంచి ఆయుధం తీస్తున్న‌ట్లు చూపించింది. RRR దీంతో రాంచ‌ర‌ణ్‌ను నిప్పుగా, ఎన్టీఆర్‌ను నీరుగా ఈ సినిమాలో చూపించ‌న‌ట్లు తెలుస్తుంది. ఇక RRR ఈ చిత్రం కోసం ఎంతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇటీవ‌లే గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ ఏడాది అక్టోబ‌‌ర్ 13వ తేదీన RRR ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ చేస్తున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.‌