సీఎం కేర్ ఫండ్ కి చియాన్ విక్రమ్ డొనేషన్

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి తమిళనాడు కోలుకోవట్లేదు. రోజుకి దాదాపు 30 వేళా కేసుల వస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజలని కాపాడడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేస్తోంది. గవర్నమెంట్ కి అండగా ఉండడానికి సినీ తారలు కూడా ముందుకి వచ్చి తమ వంతు సాయం చేస్తున్నారు. సూర్య కార్తీ, డైరెక్టర్ మురుగదాస్, హీరో శివ కార్తికేయన్, తల అజిత్ తర్వాత ఈ లిస్ట్ లో చియాన్ విక్రమ్ కూడా జాయిన్ అయ్యారు. 30 లక్షల రూపాయలని విక్రమ్ తమిళనాడు సీఎం కేర్ ఫండ్ కి డొనేట్ చేశారు. ప్రస్తుతం మూడు భారీ సినిమాలని విక్రమ్ లైన్ లో పెట్టాడు. మణిరత్నంతో చేస్తున్న పొన్నియన్ సెల్వన్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ తో కూడా విక్రమ్ ఒక మూవీ చేస్తున్నాడు.