డైరెక్టర్ శంకర్ అమ్మగారు మృతి…

ఇండియన్ ఫిల్మ్ స్టార్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ తో ఇండియన్ 2 సినిమా వివాదం ఫేస్ చేస్తున్న శంకర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ముత్తు లక్ష్మి(88) మంగళవారం కన్నుమూశారు. వయసు మీద పడడంతో ఆరోగ్య సమస్యలతో ఆమె మరణించారు. బుధవారం చెన్నైలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్‌ తల్లి మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం తెలిపారు.