చిరు చరణ్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీనే

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కొరటాల రాసిన కథలో భాగంగా చిరు యంగ్ ఏజ్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ అని, ఆ పాత్రలో చిరు కనిపించడం కన్నా చరణ్ కనిపిస్తే బాగుంటుందని కొరటాల భావిస్తున్నాడట. ఇదే విషయం కొరటాల చరణ్ కి చెప్పి ఒప్పించాడని కూడా టాక్ వినిపిస్తోంది.

ఈ వార్త ప్రకారం చిరు సినిమాలో చరణ్ యంగ్ చిరంజీవిలా కనిపించబోతున్నాడు. అయితే ఇదే విషయంలో వినిపిస్తున్న మరో కోణం ఏంటంటే , chiru152 సినిమాలో ఒక పాత్రలో మెగాస్టార్ నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇతన్ని పట్టుకునే పోలీస్ పాత్రలో చరణ్ కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవి పోరాటం నచ్చక, అతన్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీస్ ఆఫీసర్, చిరుతోనే కలిసి పోరాటం చేయడం మొదలుపెట్టే పాత్ర కొరటాల రాశాడని, అది చరణ్ మాత్రమే చేస్తాడు అని మరికొందరు అంటున్నారు. ఈ రెండు వార్తల్లో ఏది నిజం అనేది స్పష్టంగా తెలియదు కానీ చిరు సినిమాలో చరణ్ నటించడం మాత్రం ఖాయం అంటున్నారు. యంగ్ చిరంజీవిలా చరణ్ కనిపిస్తే మాత్రం… చిరు అండ్ చరణ్ ని ఒకేసారి స్క్రీన్ పై చూడడం కష్టం కానీ మల్టీస్టారర్ అయితే మాత్రం థియేటర్స్ లో మెగా అభిమానులు చేయబోయే రచ్చ మాములుగా ఉండదు.

చిరు చరణ్ కలిస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో ఇప్పటికే మనం చూశాం.. ఇప్పుడు నాలుగోసారి ఈ తండ్రీకొడుకుల కాంబినేషన్ ఆన్ స్క్రీన్ కనిపిస్తే చాలా మందికి అదో విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఈ ఎడాది చివరిలో #Chiru152 షూటింగ్ మొదలుపెట్టి, చరణ్ పేరుని సర్ఫరైజ్ ఎలిమెంట్ గా వచ్చే ఏడాది అనౌన్స్ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది? చిరు సినిమాలో చరణ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.