17 ఏళ్ల తర్వాత గొడవ పడిన నటుడితోనే కలిసి వర్క్ చేస్తున్న అజిత్

విశ్వాసం, నెర్కొండ పార్వై సినిమాలతో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాలిమై. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా గ్రాండ్ లాంచ్ జరుపుకుంది. వినోద్ డైరెక్ట్ చేస్తున్న వాలిమై రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాలో అజిత్ పక్కన వడివేలు నటిస్తున్నాడు. ఒకప్పుడు అయివుంటే ఇది పెద్ద న్యూస్ అయ్యేది కాదు కానీ 17 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కారణంగా… ఇదో సెన్సేషనల్ న్యూస్ అయ్యింది.

ajith valimai

వాలిమైలో వడివేలు నటించడం అనేది కోలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ అయ్యింది దానికి కారణం.. అజిత్ అండ్ వడివేలు మధ్య జరిగిన గొడవే. 2002లో వీరు ఎళిల్‌ డైరెక్ట్ చేసిన సినిమా రాజా, ఇందులో అజిత్ వడివేలు కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అజిత్ వడివేలు మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా బయటకి రాలేదు. మరి ఇన్నేళ్లకి కలిసిన ఈ కాంబినేషన్ వాలిమై సినిమాకి ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.