ట్రిప్ లేదు… సెట్ లోనే అన్నీ… జాన్ కోసం 25 సెట్స్ తో రిస్క్?

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం జాన్. పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రాథాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూరోప్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని బాగా గ్యాప్ తీసుకున్న తర్వాత రీసెంట్ గా జాన్ రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ లవ్ స్టోరీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో యూరోప్ సిటీ సెట్ నే వేశారు.

prabhas

సాహూ బడ్జట్ మైండ్ లో ఉందో లేక కథ ట్రావెల్లింగ్ అవసరం లేదు అనుకున్నారో ఏమో కానీ చిత్ర యూనిట్, ఎక్కడికీ వెళ్లకుండా హైదరాబాద్ లోనే షూటింగ్ కంప్లీట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 1960ల్లో జరిగే కథ కావడంతో, ఆ కాలాన్ని చూపించేలా 25 రకాల సెట్స్ ను వేయిస్తున్నారు. ఎంతగా సెట్ లో చేసినా మల్టీలింగ్వల్ సినిమాగా తెరకెక్కుతుంది కాబట్టి బడ్జట్ భారీగానే ఉంటుంది. దాదాపు 180 కోట్లు ఖర్చు పెట్టి జాన్ ని రూపొందించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అయితే సాహూ సుజిత్ లాగే రాధాకృష్ణకి కూడా ఇంతక ముందు ఒకటే సినిమా తీసిన అనుభవం ఉంది, అది కూడా యావరేజ్ మూవీ. ఇంత బడ్జట్ ని అతను హ్యాండిల్ చేయగలడా అనేది ఆలోచించాల్సిన విషయమే. వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్న జాన్ సినిమాని గోపికృష్ణ మూవీస్ అండ్ యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు.