కేటీఆర్ సోనూసూద్ మధ్య చాటింగ్ వైరల్…

బ్రదర్ ఆఫ్ ఇండియాగా సినిమాలకి అతీతంగా పేరు తెచ్చుకున్న సోను సూద్, ఇప్పుడు అందరికీ నీడ్ ఆఫ్ ది అవర్. ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తున్న సోను సూద్ చేస్తున్న సహాయ కార్యక్రమాలపై కామన్ పీపుల్, సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్ల వరకూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్, సోనూసూద్ పై ట్విట్టర్ వేధికగా ప్రశంసలు కురిపించారు. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ కోసం కేటీఆర్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే ఆయన తన టీమ్ తో కలిసి అక్సీజన్ కాన్సన్ట్రేటర్ ను అందజేశారు. దాంతో ఆ నెటిజన్ మీరు తెలంగాణ ప్రజలకు నిరంతరాయంగా సాయం చేస్తున్నారు. మీరు రియల్ హీరో అంటూ కేటీఆర్ ను ప్రశంసించారు. దానికి స్పందించిన కేటీఆర్ ”నేను ప్రజలచేత ఎన్నుకోబడిన నేతను మీరు సోనూసూద్ ను సూపర్ హీరో అని ఖచ్చితంగా పిలవాలి” అంటూ సమాధానం ఇచ్చారు. దానికి సమాధానం ఇచ్చిన సోనూసూద్.

”థాంక్యూ సో మచ్ సార్. కానీ మీరు సూపర్ హీరో తెలంగాణ ప్రజల కోసం మీరు ఎంతో చేశారు. మీ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ నా రెండో ఇల్లు నేను పని చేసుకునే ప్రదేశం అంతే కాకుండా తెలంగాణ ప్రజలు నాపై ఎంతో ప్రేమను కొంత కాలంగా చూపిస్తున్నారు.” అంటూ సోను సూద్ ట్వీట్ చేశారు. కేటీఆర్ సమాధానమిస్తూ…”ధన్యవాదాలు సోనూసూద్ గారు. మీరు ప్రారంభించిన గొప్ప పనులను కొనసాగించండి. మిలియన్ల మంది ప్రజలకు మీరు ఓ ఇన్స్పిరేషన్” అంటూ పేర్కొన్నారు. దానికి సోనూ సూద్ రిప్లై ఇస్తూ…”కచ్చితంగా బ్రదర్…ఈ మిషన్ ను నేను కొనసాగిస్తూనే ఉంటాను. మిమ్మల్ని కలిసేందుకునే నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. హైదరబాద్ వచ్చిన తరవాత మిమ్మల్ని కచ్చితంగా కలుసుకుంటాను. మీరు ఎంతో మందికి ఇన్ప్సిరేషన్” అంటూ సోనూసూద్ పేర్కొన్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.