3000 మందికి 5000 సాయం, యష్ ది ట్రూ స్టార్ ఆఫ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ప్రజలు బాగా ఇబ్బందిపడుతున్న ఈ సమయంలో సినీ వర్గాలు ముందుకి వచ్చి తోచిన సాయం చేస్తున్నారు. కర్ణాటకలో సెకండ్ వేవ్ మరీ ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గవర్మెంట్ కి అండగా హీరోలు కూడా వచ్చిన ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తున్నారు. ఈ లిస్ట్ లో కన్నడ స్టార్ హీరో యష్ కూడా కలిశాడు. KGFతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన యష్ కన్నడ ఇండస్ట్రీలో ఉన్న 21 ఫిల్మ్ యూనియన్ వర్కర్స్ కి అండగా నిలిచాడు. దాదాపు 3000 మందికి 5000 రూపాయల సాయం అందించాడు యష్. అంటే దాదాపు కోటిన్నర సాయం అందించిన యష్, ఈ సాయం ఒక హోప్ గా ముందు మంచి రోజులు రాబోతున్నాయి అనే నమ్మకం ఇవ్వడానికి చేసిన కార్యక్రమం అని చెప్పాడు. షూటింగ్ లేక ఇబ్బంది పడుతున్న వారికి యష్ ఇచ్చిన డబ్బులు ఎదో ఒక రకంగా అండగా నిలుస్తాయి. మూడు వేల మందికి నెల రోజుల పాటు కడుపు నింపిన యష్, నిజంగానే కన్నడ స్టార్. యష్ లేటెస్ట్ మూవీ KGF 2 కోసం ఇండియా అంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. అక్టోబర్ నెలలో ప్రజల ముందుకి రానున్న ఈ మూవీ ఎన్ని బాక్సాఫీస్ లెక్కల రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.