క్రిష్ 4 ముందుకన్నా గ్రాండ్ గా…

హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేష్ రోషన్ క్రిష్ సిరీస్ ని కొనసాగిస్తున్నారు. ఇండియన్ ఫస్ట్ సూపర్ హీరో కథగా వచ్చిన క్రిష్ నుంచి ఇప్పటివరకూ మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు డైరెక్టర్ రాకేశ్ రోషన్, క్రిష్ సిరీస్ లో 4వ సినిమాకి రెడీ అవుతున్నారు. ఓ భయంకర వైరస్ భారీ నుంచి ఇండియాని క్రిష్ రక్షించే కథా నేపథ్యంతో క్రిష్ 3 తెరకెక్కింది. ఈసారి విభిన్నంగా ప్రయత్నించబోతున్నారట.

క్రిష్ సిరీస్ కు బీజం పడింది ‘కోయీ మిల్ గయా’ చిత్రంతో. ఆ చిత్రంలో ఏలియన్ జాదూ ద్వారా హృతిక్ రోషన్ కి కొన్ని శక్తులు సంక్రమిస్తాయి. ఆ జాదూ తిరిగి క్రిష్ 4 లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా కథని ప్లాన్ చేస్తున్నారట. ఓ గొప్ప పని కోసం హృతిక్, జాదూతో కలసి టైం ట్రావెల్ చేస్తాడని టాక్.

ఆసక్తి పెంచుతున్న ఈ అంశంతోనే క్రిష్ 4 కథ ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ 4 మొదలైపోయి ఉండాల్సింది. కానీ పాండమిక్ వల్ల ఆలస్యమైంది. క్రిష్ సిరీస్ లో హృతిక్ కి జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి క్రిష్ 4 లో ఆమెనే రిపీట్ చేస్తారా లేక వేరే హీరోయిన్ ని తీసుకుంటారా అనేది వేచి చూడాలి.