వింటేజ్ అల్లరి నరేష్ గుర్తు చేస్తాడా?

కామెడి స్టార్ అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా Naresh58కి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్ చేసి ఆడియన్స్ ని పలకరించడానికి వచ్చేశాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అల్లరి ట్రేడ్ మార్క్ కామెడి ఉండేలా సభకు నమస్కారం సినిమా కూడా ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అంటూ అనౌన్సమెంట్ పోస్టర్ తోనే హింట్ ఇచ్చేసారు. Naresh58 టైటిల్ అండ్ పోస్టర్ ని సభకు నమస్కరం అంటూ అల్లరి పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసారు.

కొన్నేళ్ళ పాటు ఫ్లాప్స్ మాత్రమే ఫేస్ చేసిన అల్లరి నరేష్, రీసెంట్ గా నాంది సినిమాతో హిట్ కొట్టాడు. సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో అల్లరి నరేష్ యాక్టింగ్ కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాంది హిట్ అయ్యింది కానీ అల్లరి నరేష్ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ మాత్రం పూర్తిగా మిస్ అయ్యింది. సభకు నమస్కారం టైటిల్ లోనే ఫన్ ఉంది కాబట్టి అల్లరి నరేష్ బ్యాక్ టు మార్క్ అవుతూ వింటేజ్ నరేష్ ని గుర్తు చేస్తాడేమో చూడాలి.