నేను అలా చేయలేదు…

బాలీవుడ్ డ్రగ్ స్కాండల్ లో రియా చక్రవర్తి, నటి దియా మీర్జా మీరు బయట పెట్టిందని త్వరలో ఆమెకి నోటీసులు ఇస్తారనే వార్త నిన్నటి నుంచి గట్టిగా వినిపిస్తుంది. తనపై వస్తున్న ఆరోపణలపై దియా మీర్జా తీవ్రంగా స్పందించారు. జీవితంలో తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, తనపై జరుగుతున్నది తప్పుడు ప్రచారమని తెలిపారు. ఇలాంటి ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని, కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయంటూ వరుస ట్వీట్లు చేశారు.

ప్రస్తుతం, బైకుల్లా జైలులో రిమాండ్ సమయం గడుపుతున్న రియా, కొంతమంది బాలీవుడ్ నటుల పేర్లను బయటపెట్టింది. డ్రగ్ పెడ్లర్ అనుజ్ కేశ్వానీని కూడా ఎన్‌సిబి ప్రశ్నించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా రకుల్‌ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌ తదితరులకు త్వరలోనే నోటీసులు అందనున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ డ్రగ్ స్కాండల్ లో మహేష్ బాబు వైఫ్ నమ్రత పేరు వినిపించింది. మరి ఆమెకి కూడా సమన్లు ఇస్తారేమో చూడాలి.